News

సిపిఎం పాలిట్‌ బ్యూరో విచారం వ్యక్తం చేసింది


ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి వద్ద గోదావరి పుష్కరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట జరిగి 32 మంది మృతి చెందిన ఘటనపై సిపి(ఐ)ఎం పాలిట్‌ బ్యూరో దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. పుష్కర తొక్కిసలాటలో పెద్ద స్థాయిలో ప్రజలు మృతి చెందడం, ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఎక్కువ సంఖ్యలో ఉండటం పట్ల సిపిఎం పాలిట్‌ బ్యూరో విచారం వ్యక్తం చేసింది. సంఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు తమ పార్టీ తరపున తీవ్ర సంతాపం తెలిపింది. జరిగిన సంఘటన అత్యంత విచారకరమనైదని, లక్షల సంఖ్యలో యాత్రికులను ఆహ్వానించిన ముఖ్యమంత్రి వారికి సరిపోయే ఏర్పాట్లు చేయడంలో మాత్రం విఫలమవడంతో ఇలాంటి బాధాకరమైన సమస్య చోటుచేసుకుందని విమర్శించింది. సంబంధిత ఘటనపై విచారణకు ఆదేశించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా సిపి(ఐ)ఎం డిమాండ్‌ చేసింది.